- సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం
- ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊరేగింపుతో గ్రామ ప్రజలను చైతన్యపరిచారు
- గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతిజ్ఞ కార్యక్రమం
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్ధులకుంట పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊరేగింపుగా గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతిజ్ఞ చేసి ఓటు విలువను వివరించారు. ప్రధానోపాధ్యాయులు హరీష్ రెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సోన్, జనవరి 25:
నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్ధులకుంట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు మహత్త్వాన్ని గ్రామస్థులకు తెలియజేసేందుకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊరేగింపుగా గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు మాత్రమే కాకుండా, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముఖ్యమైన బాధ్యత అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి దశరథ్, చంద్రశేఖర్ రావు, టి. నరేందర్, బి. నరేందర్, భూమా రెడ్డి, ముర్తూజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల చైతన్య ర్యాలీ గ్రామస్తులను ఆకట్టుకుంది.