నాగిరెడ్డి పేట భక్తులు 48 రోజుల దీక్ష తరువాత శబరిమల యాత్ర ప్రారంభం

నాగిరెడ్డి పేట భక్తులు 48 రోజుల దీక్ష తరువాత శబరిమల యాత్ర ప్రారంభం

స్వాగతం పలికిన మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

కామారెడ్డి, ( మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
నాగిరెడ్డి పేట భక్తులు 48 రోజుల దీక్ష తరువాత శబరిమల యాత్ర ప్రారంభం

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల కేంద్రం నుండి కఠోరమైన నియమ నిష్టలతో 48 రోజులు దీక్ష చేసిన అయ్యప్ప భక్తులు, శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంలో భక్తులను మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి స్వాగతం పలికారు. భక్తులు ఆధ్యాత్మిక భావంతో, పవిత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ, దీక్షను పూర్తిచేసి శబరిమల యాత్రను ప్రారంభించడం విశేషం.
భక్తుల పాట్లు, ప్రార్థనలు, వ్రత సాధన విధానం స్థానిక ప్రజలను ప్రభావితం చేసింది. ఈ యాత్ర ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా మార్గదర్శనం పొందతారని స్థానికులు విశ్వసిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment