ముధోల్ సిఐ-ఎస్ఐలకు సన్మానం
ముధోల్ సిఐ-ఎస్ఐలకు సన్మానం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
ముధోల్ : సెప్టెంబర్ 22
నిర్మల్ జిల్లా ముధోల్‌లో గణేష్ నిమజ్జనం విజయవంతంగా ముగించడంపై సిఐ జి. మల్లేష్, ఎస్సై సాయి కిరణ్‌ను గ్రామ యువకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. రెండు చోరీ కేసులను వారం రోజుల్లోనే చేదించినందుకు కూడా వారికి శ్రద్ధ వహించారు.
అదేవిధంగా, దమ్మచక్ర పరివర్తన దివస్ మరియు దుర్గామాత నిమజ్జనాలకు కూడా ఇదే విధంగా సహకరించాలని యువకులు కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గడ్డం సుభాష్, లవలే గంగాధర్, గడపాలె సునీల్, గోసుల రాజు, లవన్, ప్రవీణ్, శేఖర్, కపాటి సాయి, మహేష్, ప్రకాష్, రత్నాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.