నిజామాబాద్‌లో బిఆర్ఎస్ నేతల సంతాపం

నిజామాబాద్‌లో బిఆర్ఎస్ నేతల సంతాపం

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్:ప్రతినిధి నవంబర్ 11
నిజామాబాద్‌లో బిఆర్ఎస్ నేతల సంతాపం

జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాకవి, గాయకుడు అందె శ్రీ అకాల మరణంపై నేతలు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ దాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. తరువాత స్వతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల సారిక హన్మంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు డా. బి. శ్రీనివాసరావు, అగ్గు సంతోష్, చింతకాయల రాజు, న్యాళం రాజు, ఫయీం ఖురేషి, షేక్ సాదిక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment