- అగ్నివీర్ పథకం పై మోదీ సర్కార్ దిద్దుబాటు చర్యలు
- అర్హతలు, పారితోషకాలలో మార్పులు
- 25% అగ్నివీర్లకు ఫుల్‌టైమ్ సర్వీస్; 50% మందికి ఎంపిక
- రక్షణ శాఖ, సైన్యానికి సిఫారసులు
మోదీ స
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: విమర్శలతో వివాదాలకు దారితీసిన ‘అగ్నివీర్ పథకం’ పై మోదీ సర్కార్ కీలక దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. పథకంలో అర్హతలు మరియు పారితోషకాలలో మార్పులు చేస్తూ, కొన్ని అగ్నివీర్లను సర్వీస్‌లో కొనసాగించే అవకాశాలు అందించనుంది. రక్షణ శాఖ వర్గాలు వెల్లడించిన ప్రకారం, ప్రస్తుతం 25% అగ్నివీర్లకు ఫుల్‌టైమ్ సర్వీస్ అందించాలనే యోచన ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని, 4 సంవత్సరాల శిక్షణ అనంతరం 50% అగ్నివీర్లను ఫుల్‌టైమ్ సర్వీస్‌కు ఎంపిక చేయాలని సైన్యం సిఫారసు చేసింది. ఈ సవరణలతో పథకం మరింత మెరుగుపడుతుందని ఉన్నతాధికారులు నమ్మిస్తున్నారు.