- చించోడు బ్రహ్మ చెరువులో గంగమ్మ తల్లికి పూజలు
- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూజ నిర్వహణ
- భారీ వర్షాలతో పల్లెలకు జలకల
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని చించోడు గ్రామంలో బ్రహ్మ చెరువుకు నీరు నిండిన సందర్భంగా, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ వర్షాలతో పల్లెలకు జలకల వచ్చిందని ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని చించోడు గ్రామంలో బ్రహ్మ చెరువు పుష్కలంగా నిండిన సందర్భంగా, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ పూజా కార్యక్రమం, బ్రహ్మ చెరువు వద్ద అలుగు దగ్గర నిర్వహించబడింది.
భారీగా కురుస్తున్న వర్షాలతో పల్లెలకు జలకల వచ్చాయని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మరియు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అనంతం, దామోదర్, డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాయక్, గూడెం జంగయ్య, సర్దార్, సిరా అంజయ్య, కాజా పాషా, ప్రసాద్, రామగుల్ల రాజు, గణేష్, సంతు నాయక్, జాంగిర్ సలీం, శ్రీనివాస్ శర్మ పంతులు, టైలర్ వెంకటేష్, ఖాదర్ తదితర గ్రామ పెద్దలు భారీ ఎత్తున పాల్గొని, పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.