కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
కోమరవేల్లి : సెప్టెంబర్ 22
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన కుటుంబంతో కలిసి కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు “నాకు మల్లన్న దేవుడంటే ఎంతో ఇష్టమని, ఆయనను దర్శించుకోవడం చాల సంతోషంగా ఉంద” అని అన్నారు.
ప్రజలందరు సంతోషంగా ఉండాలని, మల్లన్నను కోరుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఆయనతోపాటు దర్శనం పొందిన వారిలో దయానంద్ యాదవ్ తదితరులు ఉన్నారు.