నాను మహారాజ్, జగదాంబ మాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మనోరంజని ( ప్రతినిధి )
సారంగాపూర్ డిసెంబర్ 26
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బండరేవు తండా లో ఇటీవల నూతనంగా నిర్మించిన నాను మహారాజ్, జగదాంబ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం నాను మహారాజ్ ఆలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ తండా రోడ్డు నిర్మాణమయ్యేలా కృషి చేస్తానని అన్నారు, సంవత్సర కాలంలో 800 ల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం అన్నారు. రాబోవు రోజుల్లో నిరుపేదలందరికి డబుల్ బెడ్రూం ఇళ్ళు ఏర్పాటు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ లేని వారకి పెన్షన్ ఇలా ప్రతీ ప్రభుత్వ పథకం ప్రజల వద్దకు చేర్చడమే నా లక్ష్యం అని పేర్కొన్నారు. ఆదరించి అండగా ఉన్న ప్రజల కొరకు అహర్నిశలు తమ కుటుంబ సభ్యుడు వలె పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, నారాయణ, విలాస్, రాంశంకర్ రెడ్డి, చెన్న రాజేశ్వర్, ప్రకాష్, రాజా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నర్సయ్య, తిరుమల చారి, వినోద్, ఉదయ్ గౌడ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.