- మిలాద్ ఉన్ నబి వేడుకలు జహంగీర్ పీర్ దర్గాలో ఘనంగా నిర్వహణ
- శంషాబాద్ ఎసిపి శ్రీనివాస్ రావు ర్యాలీకి హాజరు
- మైనార్టీ యువత భారీ ర్యాలీ ప్రదర్శన
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇనుముల్ నర్వ గ్రామంలో మిలాద్ ఉన్ నబి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక మైనార్టీ యువత కడప పీర్ భాయ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి శంషాబాద్ ఏసిపి శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ నేతలు శ్యాంసుందర్ రెడ్డి, మహమ్మద్ అలీ ఖాన్, మహమ్మద్ ఇబ్రహీం తదితరులు హాజరై శాంతి, ఐకమత్యం సందేశాన్ని ఇచ్చారు.
సెప్టెంబర్ 21న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుముల్ నర్వ గ్రామంలో మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా జరిగాయి. కడప పీర్ భాయ్ ఆధ్వర్యంలో స్థానిక మైనార్టీ యువత ఏక్ మినార్ మజీద్ నుండి హజరత్ జహంగీర్ పీర్ దర్గా వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. శంషాబాద్ ఏసిపి శ్రీనివాస్ రావు, కొత్తూరు పోలీసులు, కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంసుందర్ రెడ్డి, పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మహమ్మద్ ఇబ్రహీం, గిరిజన కోఆర్డినేటర్ రఘునాయక్, హరినాథ్ రెడ్డి, ఇషాక్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్యాంసుందర్ రెడ్డి మిలాద్ ఉన్ నబి ర్యాలీకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, బాబాకు దట్టీలు సమర్పించారు. వందలాది మంది యువత పచ్చజెండాలతో వాహనాలపై పాల్గొని ర్యాలీని అంగరంగ వైభవంగా మార్చారు. శాంతి, సౌభ్రాతృత్వం, ఐకమత్యమే మహాబలమని, ప్రతి ఒక్కరు మహమ్మద్ ప్రవక్త బోధించిన సన్మార్గంలో నడవాలని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పిసిసి నేత మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ, ముస్లింలకు మహమ్మద్ ప్రవక్త పై ఉన్న ప్రేమ, గౌరవం ఈ ర్యాలీ ద్వారా వ్యక్తమవుతుందని అ