ఇందూర్ పంచముఖి మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా మిద్దె రవికుమార్ పటేల్ ఎన్నిక
ఇందూర్: మనోరంజని తెలుగు టైమ్స్
ఇందూర్ పంచముఖి మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా మిద్దె రవికుమార్ పటేల్ ఎన్నికైన సందర్భంగా ఆయనను మిత్రబృందం శాలువాతో ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా మిద్దె రవికుమార్ పటేల్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్ష పదవి బాధ్యతను అప్పగించిన కమిటీ సభ్యులు, మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షునిగా సంఘాన్ని ఏకతాటిపై నడిపిస్తూ, కమిటీ సభ్యుల సహకారంతో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ.కిషోర్, ఎం.కిషోర్, టి.రాజు, కె.సతీష్, టి.శ్రీనివాస్, ప్రహ్లాద్, రంజిత్, జివి.రమణ, అంబర్ సింగ్, నరేష్, హరి తదితరులు పాల్గొన్నారు.