తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన మేరే దుర్గకు రూ.5 లక్షల సహాయం

Support_for_Mere_Durga
  1. మేరే దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులు కోల్పోయి అనాథ
  2. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫౌండేషన్‌కు రూ.లక్ష సహాయం
  3. దాతల నుండి రూ.4 లక్షలు స్వీకరణ
  4. మొత్తం రూ.5 లక్షలు చిన్నారికి సహాయం
  5. డిపాజిట్ చేయబడిన మొత్తం రూ.5 లక్షలు

 Support_for_Mere_Durga

 తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన మేరే దుర్గకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష సహాయం అందింది. దాతల సహకారంతో మొత్తం రూ.5 లక్షలు అందించి, బైంసా తపాల కార్యాలయంలో 10 సంవత్సరాల డిపాజిట్ చేసినట్లు తానుర్ తహసీల్దార్ తెలిపారు.

 నిర్మల్ జిల్లా తానుర్ మండలం బేలత్ రోడా గ్రామానికి చెందిన మేరే దుర్గ అనే చిన్నారి, గత నెలలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. చిన్నారికి ఆపదకాలంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫౌండేషన్ సహాయం అందించింది.

మంగళవారం రోడ్డు భవనాలు, సినిమాటో గ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన కుమారుడు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష సహాయం అందించారు. అలాగే, దాతల నుంచి స్వీకరించిన రూ.4 లక్షలతో కలిపి మొత్తం రూ.5 లక్షలు మేరు దుర్గకు సహాయం అందించారు.

ఈ మొత్తాన్ని, గ్రామస్తుల సహకారంతో, మేరే దుర్గ పేరిట బైంసా పట్టణంలోని తపాల కార్యాలయంలో 10 సంవత్సరాల డిపాజిట్ గా పెట్టారని తానుర్ తహసీల్దార్ వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment