కలుషిత రాజకీయాలు – కలియుగ కాలజ్ఞానం పై మేడా శ్రీనివాస్ భవిష్య విశ్లేషణ

  • నేటి రాజకీయాలు కేసీఆర్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సామాజిక కలుషిత రాజకీయాలు
  • కార్పొరేట్ మీడియా ప్రభావం
  • 2050 లో అంబేద్కర్ మరియు రాజ్యాంగ విలువల కనుమరుగయ్యే ప్రమాదం
  • భారతీయ స్త్రీల పై కార్పొరేట్ కుట్రలు
  • “ఖల్కి” రూపంలో ధర్మ రక్షకుడి జననం

కలుషిత రాజకీయాలు

మేడా శ్రీనివాస్, కలియుగ కాలజ్ఞాన పరిశోధకుడు, నేటి రాజకీయ వ్యవస్థను మరియు కార్పొరేట్ శక్తుల వ్యూహాలను విమర్శిస్తూ భవిష్యత్తు పై ఆందోళన వ్యక్తం చేశారు. 2050 తరువాత అంబేద్కర్, రాజ్యాంగ విలువలు మరిచిపోతారని, కార్పొరేట్ మీడియా, రాజకీయ వ్యూహాలు ప్రజలను మోసగిస్తున్నాయని ఆయన అన్నారు. ఖల్కి రూపంలో ధర్మ రక్షకుడు జనిస్తారని విశ్వసించారు.

నేటి రాజకీయాలు మరియు కార్పొరేట్ ప్రభావంపై కలియుగ కాలజ్ఞాన పరిశోధకుడు మేడా శ్రీనివాస్ విశ్లేషణ వెలువరించారు. “నేటి కలుషిత రాజకీయాల అబద్దాలకు కేసీఆర్ మరియు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు,” అని ఆయన అన్నారు.

సమాజంలో కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలు ప్రజలను మోసగించే రీతిలో “రోత వార్తలను” ప్రచారం చేస్తున్నాయని, నిజాలను బయటపెట్టే చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో ఇవి ఉంటే బ్రిటిష్ పాలన కొనసాగేదని ఆయన పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం అమలు దిశలో మారుతున్న చట్టాలు ప్రజలకు మేలు చేయకుండా కార్పొరేట్ రాజకీయ వ్యూహాలకే అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బి ఎన్ ఎస్ చట్టాలు అమలులో కొత్తగా ప్రవేశపెట్టిన నియమాలు క్రిమినల్ కేసులను సరిగ్గా విచారణ చేయడంలో విఫలమవుతాయని చెప్పారు.

2050 సంవత్సరానికి కార్పొరేట్ వ్యూహాలు అంబేద్కర్ ను ప్రజల మనసులో నుండి తీసివేస్తాయని, సామాన్యులకు న్యాయం చేయలేని కొత్త చట్టాల వల్ల ప్రజలు బాధితులుగా మారతారని ఆయన అన్నారు.

అంతేకాక, భారతీయ స్త్రీలపై కార్పొరేట్ శక్తులు వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే వ్యూహాలను అమలు చేస్తున్నాయన్నారు. స్త్రీ శక్తిని అణచివేయాలని చూస్తున్న కార్పొరేట్లు సనాతన ధర్మాన్ని కాపాడే శక్తిని కోల్పోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కలుషితం చేసే ప్రయత్నాలను ఆయన ఖండించారు. భవిష్యత్తులో కల్కి రూపంలో ధర్మ రక్షకుడు జన్మిస్తాడని, ప్రపంచంలో జరుగుతున్న రాక్షస యుగాంతాన్ని జయిస్తాడని శ్రీనివాస్ విశ్వసించారు.

Leave a Comment