కాజీపల్లి కలభైరవ స్వామి దేవస్థానంలో మాజి జడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి దర్శనం
మనోరంజని తెలుగు టైమ్స్ – డిసెంబర్ 09
మెదక్ జిల్లా కాజిపల్లి గ్రామంలోని కలభైరవ స్వామి దేవస్థానాన్ని మంగళవారం మాజి రాష్ట్ర జడ్పీటీసీ ల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సబ్బండా ప్రజలు స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రజల క్షేమం కోసం స్వామివారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.