రామేశ్వరం ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసిన మనోహర్ రెడ్డి
భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మాజీ రాష్ట్ర జడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి
రామేశ్వరం, (మనోరంజని తెలుగు టైమ్స్):
తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం రామేశ్వరంలో గల శ్రీ రామనాథస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక దర్శనం జరిగింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర జడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం దేశ ప్రజల శాంతి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. రామేశ్వరం ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన క్షేత్రంగా, భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.