ఆధ్యాత్మిక మార్గంలో పయనం అవసరం: మాజీ జెడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి

ఆధ్యాత్మిక మార్గంలో పయనం అవసరం: మాజీ జెడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి

మనోరంజని తెలుగు టైమ్స్ కామారెడ్డి, డిసెంబర్ 10

ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులతో కలిసి ఆయన కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ—ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, ధార్మిక మార్గంలో పయనించాలి. ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతను, మనసుకు నిశ్చలతను ఇస్తుంది” అని పేర్కొన్నారు. అయ్యప్పస్వామి దీక్షలో 41 రోజుల నియమ నిష్టలు అనుసరించడం మనిషి జీవితానికి క్రమశిక్షణను తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.అతను ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ పూజారి శ్రీనివాస్ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వామి గురుస్వాములు ఈశ్వర్ గౌడ్, శశికాంత్ రెడ్డి, శ్రీనివాస్, కిరణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, అలాగే ఆలయ పూజారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment