- మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు
- వరద బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం అందించారు
- AMB సినిమాస్ తరపున అదనంగా రూ. 10 లక్షలు సాయం
- మహేష్ బాబు సరికొత్త లుక్ వైరల్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు సినీ హీరో మహేష్ బాబు, తన భార్య నమ్రతతో కలిశారు. వరద బాధితుల సహాయం కోసం మహేష్ బాబు రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. అదనంగా AMB సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షలు సాయం చేశారు. మహేష్ బాబు సరికొత్త లుక్‌తో కనిపించడంతో, ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
తెలుగు సినీ హీరో మహేష్ బాబు, తన భార్య నమ్రతతో కలిసి ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలను వరదలు భారీగా ప్రభావితం చేసిన నేపథ్యంలో, బాధితులను ఆదుకునేందుకు మహేష్ బాబు ముందుకొచ్చారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి రూ. 50 లక్షల చెక్కును వరద బాధితుల సాయంగా అందజేశారు. అదనంగా, మహేష్ బాబు యొక్క AMB సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షలు విరాళంగా అందించారు.
సీఎం రేవంత్ రెడ్డి మహేష్ బాబు సాయాన్ని ప్రశంసిస్తూ, శాలువా తో సత్కరించారు. మహేష్ బాబు గడ్డం, జుట్టు పెంచుకొని సరికొత్త లుక్‌లో కనిపించడంతో, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ లుక్‌ను చూసి “మహేష్ లుక్ అదిరింది” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.