Local body Elections | స్థానిక ఎన్నికలపై యువత దృష్టి.. గ్రామాల్లో ప్రశ్నించే గొంతుగా యువత..!
Local body Elections | ఫిబ్రవరి : స్థానిక సంస్థల ఎన్నికల (Local body Elections) పై గ్రామ యువత (Youth)ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
5ఇప్పటికే గ్రామాల్లో సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా మారుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోని యువకులు రాజకీయ నాయకులుగా.. ప్రజాప్రతినిధులుగా మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమాన్ పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లోని యువకులు స్థానిక ఎన్నికల పోరులో పోటీ చేసి తమ సత్తా ఏమిటో చూపించాలనే కుతూహలంతో ఉన్నారు. ఆయా రాజకీయ పార్టీల నుండి పార్టీ అభ్యర్థిగా గుర్తింపు కోసం నిరీక్షిస్తున్నారు.
నోటిఫికేషన్ వెలువడినంకా.. తాము నమ్ముకున్న పార్టీల నుండి ఆశించిన విధంగా తమకు గుర్తింపు లభిస్తుందా.. లేదా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. సీనియర్ రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, అందులో మాజీ ప్రజా ప్రతినిధులు కూడ అధికంగా ఉండటం.. యువకులకు సీనియర్ నేతల నుండి పోటీ ఉండడంతో.. వారి ఆశలకు ప్రతిభందకంగా మారే అవకాశాలు లేక పోలేదు. వివిధ రాజకీయ పార్టీల పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్లకు పెద్దపెట వేస్తారా ..? లేక యువతకు ప్రాధాన్యత కల్పిస్తారా..? అన్నది తేలాలంటే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై.. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా వెలువడితే కానీ తెలియని పరిస్థితి నెలకుంది.
ఇది ఇలా ఉండగా.. కొంత మంది యువకులు తమకు అవకాశం ఇవ్వని యెడల రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలు లేక పోలేదు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే.. ఆయా పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే పరిస్థితి నెలకుంటుంది. అద్భుతమే జరిగితే యువ రెబల్స్ కూడ గెలిచిన ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.
యువకులు పరిషత్ ఎన్నికలైన ఎంపీటీసీ, జడ్.పీ.టీ.సీలకే కాకుండా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు యువత పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సారి జరగబోయే.. పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీ. ఆర్. ఎస్, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీల్లో యువత కు ఏ పార్టీ అవకాశం ఎక్కువగా కల్పిస్తుంది.. అనేది ఆసక్తిగా మారింది