కరీంనగర్, ఆగస్ట్ 2
స్నేహం అనేది ఈ సృష్టిలో ఒక అపురూప కావ్యం. కాలం మారినా, లోకం మారినా స్నేహబంధం మారదని, జీవిత ప్రయాణంలో స్నేహమే శ్రీరామరక్ష అని, ఆశల తీరానికి స్నేహమే చుక్కాని అని ప్రముఖ రచయిత నేదునూరి కనకయ్య పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
స్నేహం అనేది ఈ సృష్టిలో ఒక అపురూప కావ్యం. కాలం మారినా, లోకం మారినా స్నేహబంధం మారదని, జీవిత ప్రయాణంలో స్నేహమే శ్రీరామరక్ష అని, ఆశల తీరానికి స్నేహమే చుక్కాని అని ప్రముఖ రచయిత నేదునూరి కనకయ్య పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం అయితే, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అని ఏ.పి.జె. అబ్దుల్ కలాం అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. కలిసి నడిచే అడుగులో కష్టం తెలియదని, కన్నీరు తుడిచే చేతికి స్వార్థం ఉండదని, కల్మషం లేని నవ్వులకు స్నేహమే వేదిక కావాలని కనకయ్య అన్నారు.
నిజమైన స్నేహం అనేది రెండు శరీరాలలో ఒకే ఆత్మలాంటిదని, స్నేహితునితో పంచుకుంటే బాధలు సగం అవుతాయని, కలిసి పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుందని ఆయన వివరించారు. అవగాహనే స్నేహానికి బలమైన శక్తి అని, కష్టాల చీకటిలో వెలిగే దీపం, భవిష్యత్తుకు దారి దీపం స్నేహం అని పేర్కొన్నారు.
అపార్థాల అలలు ఎన్ని వచ్చినా, ఆత్మీయ తీరం చేర్చే నావ స్నేహం అని, లోకమంతా ఎదురు తిరిగి నిలిచినా వెనుక ఉండే ధైర్యం స్నేహమేనని కనకయ్య అన్నారు. తన తప్పులను సరిదిద్ది సరైన మార్గం చూపించే మార్గదర్శి, తన గెలుపుకు నీవు పొందే సంతోషం మన స్నేహానికి ప్రతిరూపం అని తెలిపారు. స్నేహం ఈ సృష్టిలో యుగాలైన చెరిగిపోని జ్ఞాపకం, మరణమైనా విడదీయలేని సత్యం అని కొనియాడారు.
స్నేహహస్తం అందించి సామాజిక ఉద్రిక్తతలను అడ్డుకుందామని, సామాజిక శాంతిని స్థాపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. స్నేహం లేకపోతే జీవితంలో ఏదీ లేదని, అన్ని సంపదలు ఉన్నప్పటికీ స్నేహితులు లేని జీవితం వ్యర్థమని అరిస్టాటిల్ అన్న మాటలను ఉటంకించారు. స్నేహమనేది వ్యాపారం కాదు, ఒక పవిత్రమైన బంధం, ప్రతిఫలం ఆశించనిదే నిజమైన స్నేహం అని స్వామి వివేకానంద వాక్యాలను గుర్తు చేశారు. యువత జీవనశైలి కావాల్సిన స్నేహం, ఆందోళనలకు దూరంగా ఆనందానికి దగ్గరగా నూతన జీవితాన్ని ఆవిష్కరించాలని ఆయన సూచించారు.












