ముధోల్, 2026-06-05
మండల కేంద్రమైన ముధోల్ తో పాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య గల అనుబంధానికి తరతరాలుగా ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తోంది.
మండల కేంద్రమైన ముధోల్ తో పాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య గల అనుబంధానికి తరతరాలుగా రక్షాబంధన్ పర్వదినం నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ పండుగ రోజున తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టి, వారి క్షేమాభివృద్ధిని అక్కాచెల్లెళ్లు కోరుకుంటారు. ఈ రాఖీ వారి ప్రేమానుబంధానికి సూచనగా నిలుస్తుంది. ఈ సందర్భంగా తమ అక్కాచెల్లెళ్లకు అన్నలూ, తమ్ముళ్లూ బహుమతులు అందించి ఆశీర్వాదం పొందారు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా రక్షాబంధన్ పండుగ వేడుకల సందడి కనిపించింది. ప్రధాన కూడళ్లలో రాఖీల అమ్మకాల స్టాళ్లు వెలిశాయి. అదేవిధంగా, స్వీట్ల దుకాణాల్లోనూ కొనుగోళ్లతో కిటకిటలాడాయి.

