గోళీలింగాల గ్రామంలో దుందిగల్ల సిద్ధిరాములు దశదిన కర్మకు నాయకుల నివాళి
నాగిరెడ్డిపేట, జనవరి 12 మనోరంజని తెలుగు టైమ్స్ :
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోళీలింగాల గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుందిగల్ల సిద్ధిరాములు అనారోగ్యంతో ఈ నెల 2న మృతి చెందిన విషయం తెలిసిందే.
సోమవారం నిర్వహించిన ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి,
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొని,
సిద్ధిరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఈ విషాద సమయంలో మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో
మాజీ సొసైటీ చైర్మన్ నర్సింలు,
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సిద్ధయ్య, మాజీ సర్పంచులు మురళి, బాలరెడ్డి,
నాయకులు హన్మంత్ రెడ్డి, నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుందిగల్ల సిద్ధిరాములు మరణం గ్రామానికి తీరని లోటని, ఆయన సేవలను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.