సాయి బాబా దర్శనమైన జెడ్పీటీసీల ఫోరం నేత
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – ఎల్లారెడ్డి, డిసెంబర్ 12
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సాయి బాబా ఆలయంలో గురువారం ఉదయం మాజీ జెడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ప్రత్యేక దర్శనం చేశారు. వేకువజామున ఆలయంలో పూజారి ఆధ్వర్యంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.