ఉంగరం గుర్తుకు మద్దతు కోరిన లక్ష్మీనారాయణ
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – నాగిరెడ్డి, డిసెంబర్ 12
నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ నారాయణ గురువారం ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామస్థులను అభ్యర్థించారు.ఈ ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, డైరెక్టర్ జయరాజ్, గ్రామంలోని పలు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అభ్యర్థి ప్రజలతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.