భీమగల్‌లో కోటి దీపోత్సవం – కార్తీక మాసానికి శుభారంభం

భీమగల్‌లో కోటి దీపోత్సవం – కార్తీక మాసానికి శుభారంభం

శ్రీ రామ సేవా మండలి ఆధ్వర్యంలో నవంబర్ 14న ఘనంగా నిర్వహణ

మనోరంజని తెలుగు టైమ్స్
భీమగల్ ప్రతినిధి, నవంబర్ 10

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణంలో శ్రీ రామ సేవా మండలి ఆధ్వర్యంలో, కార్తీక మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 14వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 5:00 గంటలకు పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ రామ పీఠాధిపతి నంబి వాసుదేవ చార్యులు, శ్రీ రామ సేవా మండలి సభ్యులు మరియు సమస్త హిందూ బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కోటి దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని తరించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment