నెట్ బాల్ ఎస్.జి.ఎఫ్ అండర్–17 రాష్ట్రస్థాయికి ఎంపికైన కోన సముందర్ పాఠశాల విద్యార్థిని
మనోరంజని తెలుగు టైమ్స్ – బాల్కొండ
ప్రతినిధి: గుర్రం నరేష్
ఉమ్మడి నిజామాబాద్–కామారెడ్డి జిల్లాలోని తిర్నన్పల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన నెట్ బాల్ క్రీడ సెలెక్షన్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన జెడ్పీహెచ్ఎస్ కోన సముందర్ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని పి. సాహిత్య ఎస్.జి.ఎఫ్ అండర్–17 విభాగంలో రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మధుపాల్ ఆమెను అభినందించి, రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. గ్రామ విడిసి అధ్యక్షులు మెల్ల గంగాధర్, గ్రామ కమిటీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడల నిర్వహణ బాధ్యతలలో ఉన్న ఫిజికల్ డైరెక్టర్ బి. రమేష్ గౌడ్ మాట్లాడుతూ—“ఈ నెల 21, 22, 23 తేదీల్లో నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలో సాహిత్య పాల్గొననుంది. గ్రామం, పాఠశాల, ఉపాధ్యాయులకు మంచి పేరును సంపాదించాలి” అని ఆకాంక్షించారు.