కొమ్మెర 33 కేవీ లైన్ మరమ్మతులు – శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేత
మనోరంజని తెలుగు టైమ్స్, నిర్మల్ ప్రతినిధి – నవంబర్ 07
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కొమ్మెర, అస్నాద్, దుగ్నేపల్లి, పొక్కూరు గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏ.ఈ) కేశెట్టి శ్రీనివాస్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తేదీ 08-11-2025 (శనివారం) రోజున కొమ్మెర 33 కేవీ లైన్ మరియు సబ్‌స్టేషన్ లో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కారణంగా ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు, 33 కేవీ కొమ్మెర ఫీడర్ పరిధిలోని కొమ్మెర, అస్నాద్, దుగ్నేపల్లి, పొక్కూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వివరించారు.
తాత్కాలిక విద్యుత్ అంతరాయం పట్ల చింతిస్తూ, వినియోగదారులు సహకరించగలరని విద్యుత్ శాఖ తరఫున ఏ.ఈ కేశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.