విద్యార్థులకు ఆయుర్వేదంపై అవగాహన

విద్యార్థులకు ఆయుర్వేదంపై అవగాహన

తానూర్ మనోరంజన్ ప్రతినిధి నవంబర్ 1

విద్యార్థులకు ఆయుర్వేదంపై అవగాహన

మండల కేంద్రమైన తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ (బైపిసి) విద్యార్థులు, అధ్యాపకులు కలిసి భైంసాలోని ఆరాధనా ఆయుర్వేద చికిత్సాలయాన్ని సందర్శించారు. డా. వేదాంత పాటిల్, డా. జూలీ, డా. సాయి కుమార్ తదితర వైద్యుల బృందం విద్యార్థులకు ప్రకృతిలో లభించే చెట్ల ద్వారా రోగాలను ఎలా నయం చేస్తారో వివరించారు. అనంతరం భైంసాలోని వన క్షేత్రాన్ని సందర్శించి అనేక రకాల చెట్లు వాటి శాస్త్రీయ నామాలు, ఔషధ గుణాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ ఫణి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్రం అధ్యాపకులు లక్ష్మణ్, విజయ్, అనిత, సాయినాథ్ సహా పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇదొక మంచి అనుభూతిని ఇచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment