ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల కృతజ్ఞతలు

జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధి
  • తెలుగు జర్నలిస్టుల ప్రతినిధులతో సమావేశం
  • ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ సమస్యలపై చొరవ
  • జర్నలిస్టు సంక్షేమానికి రూ.10 కోట్ల తెలంగాణ మీడియా అకాడమీ నిధులు


తెలుగు జర్నలిస్టుల ప్రతినిధులు, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ, ప్రజా ప్రభుత్వానికి జర్నలిస్టు సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధికి ప్రశంసలు కురిపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో తీసుకుంటున్న చర్యలకు తెలుగు మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా, అక్కడ పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృందం ఆయనను కలిసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ వంటి కీలక సమస్యలపై ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవను అభినందించారు.

దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, జర్నలిస్టు సంక్షేమం కోసం రూ.10 కోట్లను తెలంగాణ మీడియా అకాడమీకి కేటాయించడం జర్నలిస్టు సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నిజమైన జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, జర్నలిస్టుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వానికి అవసరమైనవారని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version