ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరణ
బాల్కొండ / నిజామాబాద్: మనోరంజని తెలుగు టైమ్స్
ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలపై ట్రాన్స్ స్పెసిఫిక్ ఇండియా అందిస్తున్న సేవలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్ స్పెసిఫిక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ గోపిడి గంగారెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కంతేశ్వర్, నితీష్, యువనాయకుడు టెంపుల్, డైరెక్టర్ నాగ రావు, తూరి సాయన్న, సిర్ప రాజు, బీఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు చింతకాయల రాజు, జీవన్ రావు, రిటైర్డ్ ఎస్సై, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీనివాసరావు, దేవిదాస్ (మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు), సుజిత్ సింగ్ ఠాగూర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.