రేపు తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తక పరిచయం
మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా, నవంబర్ 12:
తెలంగాణ ఉద్యమ చరిత్రపై ఆధారిత పుస్తక పరిచయ కార్యక్రమం రేపు (నవంబర్ 13) జరుగనుంది.
కుంటాల మండలంలోని లింబా (కే) గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ మరియు పుస్తక సంపాదకులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు:
“ముధోల్ నియోజకవర్గంలోని అన్ని తెలంగాణ ఉద్యమకారులు ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి హాజరై పుస్తక పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని వారు కోరారు.