భారత్ కు భద్రతా మండలిలో
చోటు అందని ద్రాక్షేనా?
(అక్టోబర్ 24 ఐరాస ఆవిర్భావ దినం సందర్భంగా రాసిన కవిత)
ప్రపంచ వికాసానికి శాంతి
సుస్థిరత ప్రగతియే లక్ష్యంగా
ఏర్పడిన ఐరాస 8దశాబ్దాలు
పూర్తిచేసుకుంది.
అంతర్జాతీయ శాంతి
సుస్థిరత పరిరక్షణ ఆర్థిక
ప్రగతి సామాజిక అభివృద్ధిలో
కీలక భూమిక పోషిస్తుంది
ప్రపంచ దేశాల మధ్య
విభేదాలనుపరిష్కరించే
తటస్థ వేదికగా నిలచి
మానవాళికి కరోనా
మహమ్మారిలాంటి ప్రకృతి
విపత్తులు జరిగినపుడు
ప్రజలను చైతన్య పరిచే
ఐరాస ప్రపంచ శాంతి స్థాపన
యజ్ఞంలో చేస్తున్న కృషి
ప్రశంసనీయం
1990 నుండి ప్రపంచ
వ్యాప్తంగా జరిగిన
సంఘర్షణలను 40 శాతం
మేరకే తగ్గించిందని
(ఐఇపిఆర్) సర్వేలో తేలింది.
రావణకాష్టంలా మండుతున్న
ప్రధాన సంక్షోభావాలు పాలస్తీనా
సమస్య కొరియా వియత్నాం
యుద్ధ పరిష్కారంలో విఫలం
బాంగ్లాదేశ్ రూవండాలో
జరిగిన నరమేధాన్ని
ఐ రా స నివారించలేదు
అంతరిక్షంలో ఆయుధ పోటీ
నివారణ డిజిటల్ పాలన
వ్యవస్థపై ఒప్పందం ప్రస్తుతం
కొనసాగుతున్న ఉక్రెయిన్
రష్యా ఇజ్రాయిల్ పాలస్తీనా
యుద్ధాలకు మధ్యవర్తిత్వం
చేయడంలో సఫలం కాక
పోవడం వల్ల ఐరాస
పేపర్ టైగర్ గా మారింది
ప్రపంచ దేశాల మధ్య
శాంతి భద్రతలకు భరోసా
ఇవ్వడంలో ప్రేక్షక పాత్ర
పోషిస్తుంది
ఐరాస ఆవిర్భావం నాటి
నుండి నేటి వరకు అగ్ర
రాజ్యాల ఆధిపత్యమే
అప్రతిహతంగా
కొనసాగుతుంది
ఐరాస ఆవిర్భావ సందర్భంగా
అమెరికా అధ్యక్షుడు ట్రూమన్
ఐరాస కాలానుగుణంగా
విస్తృతం కావాలని
సంస్కరణలు రావాలని
అనేక దేశాలకు సభ్యత్వం
ఇవ్వాల్సిన అవసరం
ఉందన్న వాఖ్య నేటికి
ఆచరణకు నోచుకోలేదు
సంస్కరణలకు దూరంగా ఉండి
ఐరాస అలంకారప్రాయమైన
ప్రేక్షక పాత్రగా గుర్తింపు
పొందడం గమనార్హం
ఐ రా సలో సభ్యదేశాల
సంఖ్య 51 నుండి 193
దేశాలకు చేరింది భద్రతా
మండలిలో 15 దేశాలకు
మాత్రమే సభ్యత్వం ఉంది
జనాభాలో 140 కోట్లు ఉండి
ప్రపంచంలోనే 50 శాతం
యువతను కలిగి ఉండి
భారత్ ఆర్థిక వ్యవస్థ
స్థిరంగా వేగంగా
అభివృద్ధి చెందుతూ
2027_ 28నాటికి
ప్రపంచంలోనే
మూడవ అతిపెద్ద ఆర్థిక
వ్యవస్థగా అవతరించి
2047లో వికసిత భారత్
లక్ష్యంగా అడుగులువేస్తున్న
భారత్ కు భద్రతా మండలిలో
శాశ్వత సభ్యత్వం అందని
ద్రాక్షగానే మిగిలింది
విస్తీర్ణంలో ఏడవ అతిపెద్ద
దేశంగా అణ్వస్త్రాలు కలిగిన
తొమ్మిది దేశాల్లో భారత్
ఒకటిగా ఉండి
1947 నుండి నేటి వరకు
ఏదేశం పైన దురాక్రమణ
జరుపని భారత్
అమెరికా రష్యా తర్వాత
వైమానిక సామర్థ్యంలో
మూడవ స్థానం కలిగిన
భారత్ 1947 నుంచి
నేటి వరకు ఏ దేశం పైన
దురాక్రమణ జరపకుండా
ప్రపంచ మానవాళిలో శాంతి
స్థాపనకు భారత్ చేస్తున్న
సేవలు ప్రశంసనీయం
ప్రపంచ దేశాలలో ఆరోగ్యం
పర్యావరణం బాలల సంక్షేమం
కోసం ఐరాసాకు నిధులను
ఇస్తూ సహకరిస్తు ప్రపంచ
శాంతికి ప్రగతికి కృషి చేస్తున్న
భారత్ కు భద్రతా మండలిలో
శాశ్వత సభ్యత్వం ఇవ్వడం
ద్వారానే ప్రపంచ శాంతి కి
మార్గం సుగమనమవుతుంది
ఐరాస అనేక సవాళ్లను
ఎదుర్కొంటుంది పేదరికం
నిరుద్యోగం అనారోగ్య
సమస్యలు మానవ
హక్కుల ఉల్లంఘన
హింస వ్యవస్థీకృత నేరాలు
ఉగ్రవాదం ఆయుధ సంపత్తి
విస్తరణ అమెరికా చైనా
మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణి
అరికట్టాలి అన్ని దేశాలకు
సమాన గౌరవాన్ని ఇవ్వాలి
విశ్వ మానవాళికి సుఖ
సంతోషాలు పంచగలగడమే
పెద్దరికం అని అగ్రరాజ్యాలు
గుర్తించాలి.
విశ్వ శాంతికి సుస్తిరావృద్ధికి
విశ్వ మానవ శ్రేయస్సుకు
ఐరాస ద్విగుణీకృతమైన
సేవలందిస్తుందని ఆశిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771