బూత్ స్థాయిలో సభ్యత్వాలు ముమ్మరం చేయండి
బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
ముధోల్ : సెప్టెంబర్ 22
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బూత్ స్థాయిలో ముమ్మరంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కూనీంటి అంజు కుమార్ రెడ్డి సూచించారు. ఈ నెల 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకుని, ప్రతి బూత్‌లో కనీసం 200 మందికి బీజేపీ సభ్యత్వం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముధోల్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అంజు కుమార్ రెడ్డి బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పైడిపల్లి గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగర్ నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కోరి పోతన్న, ఆర్. గంగాధర్, సుష్మిత రెడ్డి, సతీష్ రెడ్డి, ధర్మపురి సుదర్శన్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.