- లోకేశ్వరంలో విధి కుక్కల స్వైర విహారం
- చిన్న పిల్లలు, వాహనదారులు, ప్రజలు భయాందోళనలో
- అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
: నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని వివిధ కాలనీల్లో విధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో తిరగాలంటే ప్రజలు, చిన్న పిల్లలు భయపడుతున్నారు. వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు, అధికారులు త్వరగా స్పందించి శునకాల బెడదను నివారించాలని కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని వివిధ కాలనీల్లో విధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో తిరగాలంటే చిన్న పిల్లలు, వాహనదారులు, మరియు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు భయపడుతున్నారు. రాత్రి వేళ ఇండ్లకు చేరుకోవాలంటే స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
విధి కుక్కలు వాహనదారులకు సమస్యలను సృష్టిస్తూ, పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు వెంటపడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలు వీధుల్లో ఆడుకోవడానికి జంకుతుండగా, రాత్రి వేళ ఇండ్లకు చేరుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ప్రజలు సంబంధిత అధికారులను త్వరగా స్పందించి శునకాల బెడదను నివారించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.