కేవలం 33 రోజుల్లో…శ్రైశైల మల్లన్నకు కార్తీకమాసంలో కళ్లు చెదిరే ఆదాయం*

*కేవలం 33 రోజుల్లో…శ్రైశైల మల్లన్నకు కార్తీకమాసంలో కళ్లు చెదిరే ఆదాయం*

కార్తీక మాసం కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగి, స్వామి–అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది.

తాజాగా చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో మొత్తం రూ. 7,27,26,400 ఆదాయం నమోదైంది

USA డాలర్లు – 646, సౌదీ రియాల్స్ – 85, యూఏఈ దిర్హమ్స్ – 120, కత్తర్ రియల్స్ – 136, సింగపూర్ డాలర్లు – 30, ఇంగ్లాండ్ పౌండ్స్ – 85, ఆస్ట్రేలియా డాలర్లు – 25, ఒమన్ బైంసా – 200లను భక్తులు హుండీలో వేశారు.

ఇతర కానుకల్లో 117.800 గ్రాముల బంగారం, 7 కిలోలు 230 గ్రాముల వెండి కూడా ఉన్నాయి. ఇవన్నీ భక్తులు స్వామి–అమ్మవార్లకు పవిత్ర కానుకలుగా సమర్పించినవి. పటిష్ట నిఘా మధ్య, ఈవో శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శివసేవకులు పాల్గొన్నారు. శ్రీశైలం క్షేత్రంపై భక్తుల నమ్మకం, భక్తిశ్రద్ధకు మరోసారి మల్లన్న హుండీ సాక్ష్యంగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment