వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం
𒊹 జనవరి 10 నుండి 19 వరకు ఆఫ్‌లైన్ టికెట్ల రద్దు
𒊹 భక్తుల సౌకర్యార్థం తీసుకున్న చర్య
𒊹 అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో హోమం
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా జనవరి 10 నుండి 19 వరకు అలిపిరి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్‌లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో 2023 నవంబరులో ఈ హోమం ప్రారంభమైన విషయం తెలిసిందే.
తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10 నుండి 19 వరకు అలిపిరిలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్‌లైన్ టికెట్లను రద్దు చేయనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో భక్తులకు సౌకర్యం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
2023 నవంబరులో ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతిరోజు జరుగుతోంది. భక్తుల సహకారం కోరుతూ టీటీడీ, ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ ప్రత్యేక కార్యక్రమాల అనంతరం టికెట్ సేవలను మళ్లీ ప్రారంభించనున్నట్లు సమాచారం.