- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు
- గణపయ్యల నిమజ్జనంలో పోలీసుల పక్కా ప్లానింగ్
- లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం సాఫీగా పూర్తి
- డ్రోన్ల సహాయంతో నిఘా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ
- పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చినా ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేవు
హైదరాబాద్ నగరంలో గణపయ్యల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జన చేశారు. రేవంత్ సర్కార్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిమజ్జన సాఫీగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు.
హైదరాబాద్ నగరంలో గణపయ్యల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు లక్షకు పైగా గణపయ్యల విగ్రహాలు నిమజ్జనం చేశారు. మూసాపేట ఐడియల్ చెరువులో అత్యధికంగా 26,546 విగ్రహాలు నిమజ్జనం కాగా, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద 4,730 విగ్రహాలు, నెక్లెస్ రోడ్ వద్ద 2,360 విగ్రహాలు, పీపుల్స్ ప్లాజా దగ్గర 5,230 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
అల్వాల్ కొత్త చెరువులో 6,221 గణపయ్యలను నిమజ్జనం చేశారు. నగరవ్యాప్తంగా 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. పోలీసుల పక్కా ప్లానింగ్ వల్ల లక్షకు పైగా విగ్రహాలు కొద్ది గంటల్లోనే సాఫీగా నిమజ్జనం అయ్యాయి.
డ్రోన్ల కెమెరాలతో నిఘా నిర్వహించబడింది, మరియు పోలీసుల కృషి, పట్టుదల, వేసిన ఏర్పాట్లు వల్ల ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భక్తులు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు ముందే ఏర్పాటు చేయడంతో గణపయ్యలు సజావుగా గంగమ్మ ఒడికి చేరారు.
ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఎంజే మార్కెట్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భక్తులు భారీగా తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులు, సీపీ సీవీ ఆనంద్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరియల్ సర్వే చేశారు.