ఈమని జగత్రిపుర సుందరి కి చిమ్నీ భూషణ పురస్కారం
ఏడు వందలకు పైగా లఘు కవితలతో చిమ్నీ ప్రక్రియలో సాహిత్య కాంతిని విరజిమ్మిన కవయిత్రి
ఏలూరుకు చెందిన ఈమని జగత్రిపుర సుందరి కి చిమ్నీ భూషణ పురస్కారం లభించింది. ఆమె చిమ్నీ ప్రక్రియలో ఏడు వందలకు పైగా లఘు కవితలు వ్రాసినందుకు శ్రీహంస వాహిని సాహిత్య కళా పీఠం ముధోల్ వారు ఈ పురస్కారం ప్రధానం చేశారు. ప్రముఖ కవి, రచయిత జాధవ్ పుండలిక్ రావు పాటిల్ రూపొందించిన చిమ్నీ ప్రక్రియలో ఆమె చేసిన కృషికి ఈ గౌరవం దక్కిందని సాహిత్య కళా పీఠం ప్రధాన కార్యదర్శి పీసర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలు జాగిరి యాదగిరి, బసవరాజు, శనిగారపు రాజమోహన్, సమీక్షకులు రాజోలి వరలక్ష్మి, గౌడి సరిత, పసువుల శంకర్, ప్రముఖ కవులు కడారి దశరథ్, కొండూరు పోతన్న, పద్యకవి వెంకట్, కవి యాత్ర వ్యవస్థాపకులు కారం శంకర్, కవయిత్రి రావుల చంద్రకళ తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.