- హైదరాబాద్ వాసులు ఆర్థిక అనిశ్చితికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం
- 95% మంది భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలో ఉన్నారు
- 83% మంది బీమా పాలసీలు తీసుకున్నారు
- 52% మంది పెట్టుబడుల్లో వైవిధ్యం పాటిస్తున్నారు
హైదరాబాద్ వాసులు భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితికి ముందస్తుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ నివేదిక ప్రకారం, 95% హైదరాబాదీయులు ముందస్తు ప్లానింగ్ చేస్తున్నారు. 83% మంది బీమా పాలసీలు తీసుకోగా, 52% మంది పెట్టుబడుల్లో వైవిధ్యం పాటిస్తున్నారు. భవిష్యత్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేలా వీళ్లు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ వాసుల ముందుచూపును తాజాగా విడుదలైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ నివేదిక 2024 స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం, 95% హైదరాబాదీయులు భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితుల నుంచి తమను రక్షించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జాతీయ స్థాయిలో 34% మంది మాత్రమే ఈ విధంగా ప్రణాళిక చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
వివరాల ప్రకారం, 83% మంది హైదరాబాదీయులు బీమా పాలసీలు తీసుకోగా, 10% మంది మ్యూచువల్ ఫండ్లు మరియు షేర్లలో పెట్టుబడులు పెట్టారు. సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్స్డ్ డిపాజిట్లలో 48% మంది పొదుపులు చేస్తున్నారు, 52% మంది పెట్టుబడుల్లో వైవిధ్యం పాటిస్తున్నారు. ఈ నివేదికలో ముఖ్యంగా ఆర్థిక భద్రత కోసం 69% మంది పొదుపు ఖాతాల్లో డబ్బులు సేవ్ చేస్తున్నారని వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల సమయంలో భరోసా కలిగించేలా జీవిత బీమా 68% మందికి ఉంది. 54% మందికి హెల్త్ బీమా పాలసీలు ఉన్నాయి. రిటైర్మెంట్ కోసం 30% మంది బెనిఫిట్ స్కీంలలో పెట్టుబడులు పెడుతున్నారని నివేదిక పేర్కొంది.