- గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం
- నిర్మల్ జిల్లా RSS సహా సంఘచాలకుడు అభినందనలు
- హనుమాన్ పీఠం ఫోటోలు మరియు కంకణం పంపిణీ
- సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రశంసలు
బైంసాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణనాథుల నిమజ్జన శోభాయాత్ర విజయవంతం అయింది. హిందూ ఉత్సవ సమితి సేవలకుగాను, నిర్మల్ జిల్లా RSS సహా సంఘచాలకుడు సాధుల కృష్ణ దాస్ అభినందనలు
తెలిపారు. హనుమాన్ పీఠం ఫోటోలు, రక్ష పంపిణీ మరింత శుభ పరిణామమని, సాంస్కృతిక కార్యక్రమాలు కొత్త ఒరవడిలో జరిగాయని ప్రశంసించారు.
సెప్టెంబర్ 17, బైంసా:
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బైంసా పట్టణంలో నిర్వహించిన గణనాథుల నిమజ్జన వీడ్కోలు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికి నిర్మల్ జిల్లా RSS సహా సంఘచాలకుడు సాధుల కృష్ణ దాస్ ప్రత్యేకంగా అభినందనలు
తెలిపారు. ఆయన మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ, అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి వారు పంపిన హనుమాన్ పీఠం ఫోటోలు మరియు రక్ష (కంకణం) పంపిణీ మరింత శుభ పరిణామమని అన్నారు.
అదే విధంగా, హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కొత్త విధానంలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని ఆయన ప్రశంసించారు. సాంస్కృతిక కమిటీ సభ్యులు కొత్త ఆలోచనలతో కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో హిందూ సమాజం, ధర్మం, దేశం కోసం ఎల్లవేళలా సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.