- రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
- కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
- మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణలో వాతావరణశాఖ నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాబోయే 24 గంటల్లో వర్షాలు అధికమవుతాయని అంచనా వేస్తున్నారు.
: తెలంగాణలో వాతావరణశాఖ అతి భారీ వర్షాల హెచ్చరికను ప్రకటించింది. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని, ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల అవకాశం ఉందని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాబోయే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారి ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రెండురోజుల తర్వాత వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేశారు.