హీప్నెల్లి తండా సర్పంచ్ ఏకగ్రీవం
మనోరంజని తెలుగు టైమ్స్, భైంసా, నవంబర్ 30:
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని హీప్నెల్లి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. ఆదివారం జరిగిన గ్రామ సభలో గ్రామ పెద్దలు, ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ రాథోడ్ సంతోష్ ధన్నును సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించగల సామర్థ్యం ఉందన్న నమ్మకంతో ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడంతో గ్రామంలో దీనిపై చర్చనీయాంశంగా మారింది. గ్రామ అభివృద్ధి, విద్య, సామాజిక కార్యక్రమాలకు తోడ్పాటుగా రూ.5 లక్షలను విద్య, ఆడపడుచుల వివాహాల కోసం గ్రామ నిధిగా వినియోగించేందుకు గ్రామస్తులు అంగీకరించినట్లు సమాచారం.