కుంటాల మండల కేంద్రానికి చెందిన తూముల్వార్ రమేష్‌కు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.60 వేల చెక్కును కుంటాల సర్పంచ్ గజేందర్ శుక్రవారం అందజేశారు.
స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. కష్ట సమయాల్లో ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారునికి సూచించారు.
లబ్ధిదారుడు తూముల్వార్ రమేష్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సహాయం తన వైద్య ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












