- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు
- టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతులు: సభ హక్కుల ఉల్లంఘన
- గతంలో టికెట్ రేట్ల పెంపుతో జరిగిన దుర్ఘటనలపై హరీష్ రావు విమర్శలు
- యూ-టర్న్ వెనుక అసలు మర్మం ఏమిటి?
మహిళ మృతి తర్వాత టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాల్లోనే మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో హామీ ఇచ్చి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలను ఆయన యూ-టర్న్ గా అభివర్ణించారు. టికెట్ రేట్ల పెంపు వెనుక అసలు మర్మం ఏమిటని ప్రశ్నించారు.
టికెట్ రేట్ల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే అసెంబ్లీలో టికెట్ రేట్లు పెంచబోమని, ప్రత్యేక ప్రివిలేజీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఆ మాటకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
గతంలో టికెట్ రేట్ల పెంపు వల్ల జరిగిన దుర్ఘటనలను గుర్తు చేస్తూ, హరీష్ రావు, “ఆ సమయంలో ఒక మహిళ మృతి చెందింది. ఒక చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రత్యేక షోలకు అనుమతులు ఇచ్చిన కారణం ఏమిటి?” అని ప్రశ్నించారు.
అసెంబ్లీ హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు విలువ లేకపోతే, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతారన్నారు.