ఘనంగా బాలల దినోత్సవం

ఘనంగా బాలల దినోత్సవం

ఘనంగా బాలల దినోత్సవం

మనోరంజని తెలుగు టైమ్స్ ముధోల్: ప్రతినిధి నవంబర్ 14

ముధోల్ మండల కేంద్రమైన ముధోల్‌లోని రబీంద్ర, అక్షర పాఠశాలల్లో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు వివిధ వేషధారణల్లో హాజరై సందడి నెలకొల్పారు. ఒకరినొకరు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు ఉపన్యాసాలు, వ్యాసరచన, ఇతర పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో పాఠాలు చెప్పడం విశేషం. రబీంద్ర పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. రకరకాల వంటకాలను విద్యార్థులు స్వయంగా తయారు చేసి స్టాల్స్‌లో ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తమ సొంత డబ్బుతో వాటిని కొనుగోలు చేసి రుచులను ఆస్వాదించారు. రెండు రోజుల నుంచే వంటకాల తయారిలో నిమగ్నమై ఫెస్టివల్‌ను విజయవంతం చేయడం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాళ్లు అసంవర్ సాయినాథ్, సుభాష్ మాట్లాడుతూ— “భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చిన్నపిల్లలను ఎంతో ఇష్టపడేవారు. అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాం” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పెర్సిస్, పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, భీమ్ రావు దేశాయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment