మెడికల్ కాలేజీలతో గురుకులాల అనుసంధానం: సీఎం ఆదేశం
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇందుకోసం ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తరచుగా వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా 24 గంటల హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రూ. 60 కోట్ల అత్యవసర చెక్కులు విడుదల చేశారు