ఎంపీడీఓకి వినతిపత్రం అందజేత
మనోరంజని : (ప్రతినిధి 2)
తానుర్, డిసెంబర్ 28.
నిర్మల్ జిల్లా తానూర్: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం రెండవ రోజుకు చేరుకుంది. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి, అనంతరం రోడ్డుపై బైటాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
అనంతరం, కార్మికులు తమ సమస్యలపై ఎంపీడీఓ అబ్దుల్ సమ్మద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, మండల అధ్యక్షుడు ఆర్. రమేష్ మాట్లాడుతూ, “తమకు న్యాయమైన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు, అలాగే పర్మినెంట్ ఉద్యోగ హామీ ఇవ్వాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు డి. గంగాధర్, ఉమాకాంత్, మధవ్ రావు, హన్మాండ్లు, అమృత్ రావు, పవార్ రమేష్, కిషన్ పవార్, కల్పన బాయి, సీఐటీయూ నాయకులు, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.