గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించండి : జాధవ్ పుండలిక్ రావు పాటిల్

గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించండి : జాధవ్ పుండలిక్ రావు పాటిల్

పీఎఫ్ పింఛన్దారుల పరిస్థితిపై ఆవేదన

మనోరంజని తెలుగు టైమ్స్ బైంసా టౌన్ నవంబర్ 21

: దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు పీఎఫ్ పింఛన్దారుల స్థితిగతులను అర్థం చేసుకుని, వారికి గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలి అని ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ వినియోగదారుల సంఘం బైంసా డివిజన్ అధ్యక్షులు జాదవ్ పుండలిక్ రావు పాటిల్ డిమాండ్ చేశారు. జీవితాంతం ఉద్యోగ జీవితం గడిపి, పదవీ విరమణ తర్వాత అందుతున్న వెయ్యి రూపాయల పిఎఫ్ పింఛను కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, వృద్ధాప్యంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలు పింఛన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పింఛన్దారులు గౌరవంగా ఎలా జీవించగలరు? అని ప్రశ్నించారు. వారి దయనీయ పరిస్థితిని పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, చాలామంది వృద్ధులు చాలీచాలని డబ్బులతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారని పుండలిక్ రావు తెలిపారు.కనీస పీఎఫ్ పింఛన్‌ను రూ.7,500కు పెంచితేనే పింఛన్దారుల జీవనోపాధిలో మార్పు వస్తుందని చెప్పారు. వృద్ధాప్యంలో ప్రతి చిన్న విషయానికీ కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి రావడం, ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల్లో వృద్ధుల అవసరాలు భారం కావడం విచారకరమని అన్నారు. దేశానికి రాజ్యాధికారులు అయిన నేతలు వృద్ధులను పట్టించుకోకపోవడంతో, వృద్ధాప్యం వారికే “మరణభారతం” అవుతుందని తీవ్ర వ్యాఖ్య చేశారు. కనీసం అయినా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని, పింఛన్దారులు ప్రశాంతంగా, గౌరవంగా జీవించేలా చూడాలని జాదవ్ పుండలిక్ రావు పాటిల్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment