- బోరిగం గ్రామంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహణ
- డీజే లేకుండా భజన పాటలతో శోభాయాత్ర
- గణపయ్యను పల్లకిలో ఊరేగింపు
- డీఎస్పీ గంగారెడ్డి శోభాయాత్ర ప్రారంభం
- గ్రామాల సంప్రదాయాల పరిరక్షణకు డీఎస్పీ సూచన
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బోరిగం గ్రామంలో హనుమాన్ గణేష్ మండలి సభ్యులు, డీజే లేకుండా భక్తి భజన పాటలతో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ గంగారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామాల సంప్రదాయాలను ఉట్టిపడేలా నిమజ్జనాన్ని నిర్వహించాలని కోరారు.
సారంగాపూర్ మండలంలోని బోరిగం గ్రామంలో హనుమాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది. డీజే లేకుండా భక్తి భజన పాటలు, కోలాటాలతో ఈ శోభాయాత్రను ప్రత్యేకంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా, చిన్ని గణపయ్యను పల్లకిలో కూర్చోబెట్టి, భక్తి పారవశ్యంలో ఊరేగింపు జరిగింది. హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా డీఎస్పీ ఏ గంగారెడ్డి ప్రారంభించారు.
డీఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించాలని సూచించారు. ఇతర గ్రామాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సారంగాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఆలూరు పిఎసిఎస్ చైర్మన్ ఏ మాణిక్ రెడ్డి, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, గణేష్ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.