వెండి అష్టలక్ష్మి కలశాలతో గణనాథుడు – 1800 కలశాలు భక్తులకు ఉచితంగా

వెండి అష్టలక్ష్మి కలశాలతో గణనాథుడు
  • 1800 అష్టలక్ష్మి కలశాలతో గణనాథుని ప్రతిష్ట
  •  
  • కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో వినూత్న గణేష్ విగ్రహం
  • 9వ రోజు నిమజ్జనం అనంతరం కలశాల ఉచిత పంపిణీ
  • గోవర్ధన గిరి సెట్టింగ్, విద్యుత్ దీపాలతో ఆకట్టుకునే మండపం

వెండి అష్టలక్ష్మి కలశాలతో గణనాథుడు


తిరుపతిలోని యాదవ వీధి, సున్నపు వీధి యువకులు 1800 అష్టలక్ష్మి కలశాలతో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహం తయారీకి 6 నెలలు పట్టగా, 11 రోజులపాటు ప్రదర్శిస్తారు. 9వ రోజు నిమజ్జనం అనంతరం భక్తులకు ఈ వెండి కలశాలను ఉచితంగా అందజేస్తారు. మండపంలో విద్యుత్ దీపాలు, గోవర్ధన గిరి సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

తిరుపతి పట్టణంలోని యాదవ వీధి, సున్నపు వీధికి చెందిన యువకులు వినాయక చవితిని వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రుల సందర్భంగా వారు 1800 అష్టలక్ష్మి కలశాలతో కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహం ప్రత్యేకతగా 150 గ్రాముల వెండితో తయారు చేసిన జంజం బొజ్జను గణనాథునికి ధరింపజేశారు.

గణనాథుని విగ్రహం తయారీకి 6 నెలల పాటు ప్లానింగ్ చేసారు, ఈ క్రమంలో నాలుగు ఆర్టిస్టులు మరియు 10 మంది హెల్పర్స్ కలిసి 11 రోజులపాటు కష్టపడి గణపతిని రూపుదిద్దారు. అష్టలక్ష్మి ప్రతిమలతో ప్రతీ కలశం ప్రత్యేకంగా రూపొందించబడింది. వినాయక చవితి రోజు ఈ విగ్రహం ప్రతిష్టించబడగా, 9వ రోజు ఆదివారం నిమజ్జనం చేయనున్నారు.

నిమజ్జనం అనంతరం భక్తులకు ఈ 1800 అష్టలక్ష్మి కలశాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గణపతి మండపం ఆకర్షణగా గోవర్ధన గిరి సెట్టింగ్, విద్యుత్ దీపాలతో రూపొందించిన స్వాగత తోరణాలు ఉన్నాయి, వీటితో భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment