- పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగివస్తూ జరిగిన ప్రమాదం
- నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు
- బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి వద్ద ప్రమాదం
అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్టినరోజు వేడుకల తర్వాత కారులో తిరిగి వస్తుండగా బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
: అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిన నలుగురు యువకులు కారులో తిరిగి వస్తుండగా, బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి వద్ద లారీతో జరిగిన ప్రమాదంలో యువకులు సంఘటన స్థలంలోనే మరణించారు.
పోలీసుల కథనం ప్రకారం, చనిపోయిన యువకులు అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన వారని గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా, లేక యువకులు మద్యం సేవించి కారు నడిపారా అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం అవుతుంది.