బుద్ధ విహార్‌లో తొలి జాడే పరివార్ పెళ్లి
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా, నవంబర్ 16:
భైంసా పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్కడి) ప్రాంగణంలో తొలిసారిగా వివాహ వేడుక జరిగింది. నిగ్వ గ్రామానికి చెందిన జాడే లక్ష్మణ్, దేగాం గ్రామానికి చెందిన పుగ్లె విద్యాశ్రీ ఈ నెల 13న ఇక్కడే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బుద్ధ విహార్‌లో జరగిన మొదటి వివాహం కావడంతో ఈ కార్యక్రమం ప్రత్యేకత సంతరించుకుంది. వధూవరులు విహార్ నిర్మాణం కోసం రూ.10 వేలు విరాళంగా విహార్ సభ్యులకు అందజేశారు. బుద్ధ విహార్ టీం సభ్యులు నూతన దంపతులకు బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలు బహూకరించి “జై భీమ్” అంటూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన బుద్ధ విహార్ కమిటీ సభ్యులకు జాడే, పుగ్లె కుటుంబాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.